నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో కొనసాగుతున్న ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళాకు విశేష ఆదరణ లభిస్తోంది. వివిధ రాష్ట్రాల నుండి దాదాపు 300 మంది చేనేత హస్తకళల స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. చేనేత హస్త కళా ఉత్పత్తులు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన కొత్త స్టాల్స్ చాలా ప్రత్యేకంగా ఉన్నవి. సాయంత్రం వాణి రమణ శిష్య బృందం చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. బ్రహ్మాంజలి, కృష్ణ శబ్దం, ఆనంద తాండవం, తరంగం, అన్నమాచార్య కీర్తనలు, రామ దాసు కీర్తనలు, తిల్లాన అంశాలను వైష్ణవి , వాగ్దేవి, భవ్య, షణ్ముఖి, శ్రీయ, సాహితి సంస్కృతి తదితరులు ప్రదర్శించారు.