నమస్తే శేరిలింగంపల్లి: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు తమవంతు చేయూతనందిస్తూ బాసటగా నిలవడం సంతోషకరంగా ఉందని బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బొబ్బ విజయ్ రెడ్డి పేర్కొన్నారు. గోవిందరావుపేట మండలంలోని దుంపెల్లిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 150 మంది విద్యార్థులకు రూ. 50 వేల విలువ గల రాత పుస్తకాలు, పెన్నులు, కంపాస్ బాక్సులు, క్రీడా వస్తువులు బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బొబ్బ విజయ్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొబ్బ విజయ్ రెడ్డి మాట్లాడుతూ బాల్యంలో తాను చదువుకున్న స్కూల్ లో ఇలాంటి కార్యక్రమాలు చేయడం గర్వంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ప్రతి సంవత్సరం పుస్తకాలను, పెన్నులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఎంపీపీ శ్రీనివాస రెడ్డి, జడ్పీటీసీ, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.