నమస్తే శేరిలింగంపల్లి: గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తనపై నమ్మకంతో ఆదరించి కార్పొరేటర్ గా గెలిపించిన మియాపూర్ డివిజన్ ప్రజలకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేటర్ గా గెలిచి ఏడాది పూర్తయిన శుభ సందర్భంగా మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి కేకు కట్ చేశారు. డివిజన్ ప్రజల ఆశీర్వాదంతో కార్పొరేటర్ గా గెలుపొంది మియాపూర్ డివిజన్ ప్రజలకు సేవ చేసే అదృష్టం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మియాపూర్ డివిజన్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, నాయకులు, వార్డు మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
