నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ శిల్పారామంలో తెలంగాణ బాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం , సింగిడి సంస్థ సంయుక్త నిర్వహణలో శనివారం సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీలంక దేశానికి చెందిన కళాకారులు సింగిడి సంస్థ అధ్యక్షులు డాక్టర్ విశ్వకర్మ నేతృత్వములో అంజనా రాజపక్ష బృందం శ్రీలంక కండ్యాం నృత్యాన్ని ప్రదర్శించారు. శ్రీలంక కళాకారులు అంజనా రాజపక్షే, సింగిడి సంస్థ అధ్యక్షులు డాక్టర్ విశ్వకర్మ , డీఎంకే కార్పొరేటర్ రవి భారతి జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. పూజ నృత్యం, లో కంట్రీ, సాంహిదీయ, పేతురు, గోవి గీతాయా అంశాలను ప్రదర్శించారు. శ్రీలంక జాతీయ నృత్యం కందయాన్ నృత్యం, కందయాన్ నృత్యం వెస్, వన్నాం, ఉడెక్కి, పాంథెరు, నైయాండి ఐదు రకాలు కోహోంబా కంకరియాతో సంబంధం కలిగి ఉన్న దృష్ట్యా కందయాన్ దేవతలను ప్రసన్నం చేసుకునే ఆచారాన్ని ప్రదర్శించారు. సాంప్రదాయకంగా ఈ నృత్యాన్ని కేవలం పురుషులు మాత్రమే ప్రదర్శించగా 1950 నుండి మహిళలు కూడా దీనిలో శిక్షణ పొందారు. పాంథెరు నృత్యం మొదట యుద్ధంలో విజయాన్ని జరుపుకోవడానికి ప్రదర్శించబడిందని చెబుతారు. పాంథెరు అనేది ఒక తాంబూలాన్ని పోలి ఉండే ఒక పరికరం (చర్మం లేకుండా), దాని అంచు చుట్టూ చిన్న స్థూపాలు జత చేయబడతాయి. పాంథెరు నృత్యాలు వాయిద్యాన్ని తిప్పి ప్రదర్శన సమయంలో చేతి నుండి చేతికి పంపుతారు. ఈ నృత్యాలను అంజనా రాజపక్షే, అగసి దేవని, నిప్పుని తెన్నకూన్, ఓజిని వీరసింఘే, సేవామి అతిగల, ఓషిని హేవవాడుగే, శావిని హతారాసింఘే కళాకారులు ప్రదర్శించారు.