రాష్ట్ర స్థితిగతులపై బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం

నమస్తే శేరిలింగంపల్లి: హైదరాబాద్ బండ్లగూడ పరిధిలోని మహావీర్ ఇంజనీరింగ్ కాలేజీలో శనివారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజకీయ తీర్మాణాలు, తెలంగాణ ఆర్థిక స్థితి, రాష్ట్రంలో అవినీతి, టీఆర్ఎస్ నియంత పాలన, దళిత బంధు, తెలంగాణ రైతు గోస, ధరణి లోపాలు, నిరుద్యోగ సమస్య ఉద్యోగాల భర్తీకై, ఉపాధి కల్పనకై తీర్మానాలను ప్రతిపాదించి రాష్ట్ర కార్యవర్గం ఆమోదించింది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, పార్టీ పెద్దలు, రాష్ట్ర సీనియర్ నాయకులు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.

బిజెపి‌ రాష్ట్రకార్యవర్గ సమావేశంలో బండి‌ సంజయ్ తో కలిసి పాల్గొన్న జ్ఞానేంద్ర ప్రసాద్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here