నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ ప్రశాంత్ నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని అసోసియేషన్ సభ్యులు మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అసోసియేషన్ సభ్యులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై సోమవారం కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. కాలనీలో మౌలిక వసతులను కల్పించాలని కోరారు. కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ న్యూ ప్రశాంత్ నగర్ లో ఏ సమస్య ఉన్న పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సహకారంతో డివిజన్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో న్యూ ప్రశాంత్ నగర్ అసోసియేషన్ అధ్యక్షులు రామకృష్ణ, అసోసియేషన్ సభ్యులు రవీందర్, రవి, శ్రీనివాస్, ఉదయ్, భాస్కర్, రాంబాబు, విక్రమ్, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.