సకాలంలో పనులు పూర్తి చేయకుంటే బ్లాక్ లిస్టులో పెడతాం: చందానగర్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని తారానగర్ కాలనీలో భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్, దీప్తి శ్రీ నగర్ కాలనీలో చేపట్టిన వరద నీటి కాలువ పనులను సోమవారం చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని కాంట్రాక్టర్లకు హెచ్చరించారు. సకాలంలో పనులను పూర్తి చేయని గుత్తేదారులను బ్లాక్ లిస్టులో పెట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, కాలనీ వాసులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

యూజీడీ పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here