నమస్తే శేరిలింగంపల్లి:రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాల వల్ల వ్యవసాయరంగం కుంటుపడిపోయే ప్రమాదం ఉందని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సమైఖ్య గ్రేటర్ హైదరాబాద్ కమిటీ కార్యదర్శి అంగడి పుష్ప పేర్కొన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. దేశంలో వ్యవసాయరంగంపై కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యతిరేక చట్టాలతో రైతాంగం తీవ్రనష్టపోయే ప్రమాదం ఉందన్నారు. పెరిగిన పెట్రోలు, డీజిల్, నిత్యావసర ధరలతో సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని అన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రైతులపై కపట ప్రేమను చూపిస్తూ కాలయాపన చేస్తున్నాయని అన్నారు. ఆబ్కారీ శాఖను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించినపుడు ధాన్యం కొనుగోలును సైతం రాష్ట్రానికే అప్పగించాలని, రైతు వ్యతిరేక చట్టాలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో పార్టీల మార్పిడి, పదవుల కోసం పాకులాట తప్పా ప్రజా శ్రేయస్సు లేదన్నారు. ఎంపీలు బండి సంజయ్, అరవింద్ తో పాటు డికె అరుణ స్పందించి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మూతపడిన మార్కెట్లను పునః ప్రారంభించాలని డిమాండ్ చేశారు.