నమస్తే శేరిలింగంపల్లి:టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని నెహ్రు నగర్ కాలనీ కి చెందిన జె. సురేష్ కి అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 2 లక్షల ఎల్ ఓ సీని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా సీఎంఆర్ఎఫ్ ఆదుకుంటున్నదని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గుమ్మడి శ్రీనివాస్, బ్రిక్ శ్రీనివాస్, పోతుల రాజేందర్, అనిల్ కావూరి, మధు తదితరులు పాల్గొన్నారు.