నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ శిల్పఎంక్లేవ్ లోని విశాఖ శ్రీ శారదా పీఠపాలిత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో లక్ష దీపోత్సవం ఏడవ రోజు వైభవంగా కొనసాగింది. విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర స్వామి మంగళవారం ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల విజయవంతంలో భాగస్వాములైన ఋత్విక్కులు, దాతలు, సేవకులను స్వామీజీ చేతుల మీదగా ఘనంగా సత్కరించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి స్వామీజీ మాట్లాడారు.

ప్రధానార్చకులు వేదుల పవన్ కుమార్ శర్మ, మురళీధర చర్మాల బృందం పర్యవేక్షణలో స్థానిక భక్తులు రాజ్ కుమార్ మధుమతిలచే సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిపించారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ యువి.రమణ మూర్తి, సభ్యులు చంద్రశేఖర్, చెన్నారెడ్డి, శిల్ప ఇంకా కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీవాసులు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించారు. ఏడవరోజు దీపోతిసవం ప్రారంభమైన సమయంలో వర్షం కురిసినప్పటికీ భక్తులు శ్రద్ధతో వేచి ఉండి, యధావిధిగా జ్యోతి ప్రజ్వలనాలు చేయడం చూపరులను ఆకట్టుకుంది.

