హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట డివిజన్ పరిధిలోని ప్రతి పట్టభద్రుడు రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకుగాను పట్టభద్ర ఓటరుగా నమోదు చేయించుకోవాలని తెరాస నాయకులు అన్నారు. శనివారం హఫీజ్ పేట డివిజన్ పరిధిలో తెరాస పార్టీ సీనియర్ నాయకుడు, డివిజన్ తెరాస గౌరవాధ్యక్షుడు వాలా హరీష్ రావు ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టభద్రులకు ఫాం 18 పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మారెడ్డి, జనార్దన్ గౌడ్, మిద్దెల మల్లారెడ్డి, విష్ణు వర్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.