మాధ‌వీన‌గ‌ర్ కాల‌నీలో కార్పొరేట‌ర్ దొడ్ల వెంక‌టేష్ గౌడ్ బ‌స్తీబాట

ఆల్విన్ కాల‌నీ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ ప‌రిధిలోని మాధవి నగర్ కాలనీలో కాలనీ సమస్యలపై కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ స్థానిక నాయకులతో కలిసి బస్తీ బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు స్థానికంగా రహదారుల ప్యాచ్ వర్క్ లు, మ్యాన్ హోల్ సమస్యలు ఇబ్బందికరంగా ఉన్నాయని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికే డివిజన్ లో పూర్తిస్థాయిలో రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేశామని, సమస్య ఉన్న ప్రాంతాలను తమ దృష్టికి తీసుకు వస్తే వెంటనే పరిష్కరించేలా కృషి చేస్తామని కార్పొరేటర్ కాలనీవాసులకు హామీ ఇచ్చారు.

మాధ‌వీన‌గ‌ర్ కాల‌నీలో బ‌స్తీ బాట నిర్వ‌హిస్తున్న కార్పొరేట‌ర్ దొడ్ల వెంక‌టేష్ గౌడ్

ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస అధ్యక్షుడు జిల్లా గణేష్, వార్డు సభ్యుడు కాశీనాథ్ యాదవ్, సీనియర్ నాయకులు బోయ కిషన్, బీసీ సెల్ అధ్యక్షుడు రాజేష్ చంద్ర, నాయకులు మహేష్ గౌడ్, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు సత్యనారాయణ, కృష్ణ కుమార్, రమేష్, వెంకట కృష్ణ, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

కాల‌నీవాసుల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకుంటున్న కార్పొరేట‌ర్ దొడ్ల వెంక‌టేష్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here