ప్ర‌జ‌ల‌కు మెరుగైన వ‌స‌తుల క‌ల్ప‌న‌కు కృషి: ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ

  • మాదాపూర్ డివిజ‌న్ ప‌రిధిలో అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు

మాదాపూర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల క‌ల్ప‌న‌కు ప్రభుత్వం ఎంత‌గానో కృషి చేస్తుంద‌ని ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ అన్నారు. శ‌నివారం మాదాపూర్ డివిజ‌న్ ప‌రిధిలో ప‌లు అభివృద్ది ప‌నుల‌కు ఆయ‌న కార్పొరేట‌ర్ వి.జగదీశ్వర్ గౌడ్ తో క‌లిసి శంకుస్థాప‌న‌లు చేశారు.

అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసిన ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, కార్పొరేట‌ర్ వి.జగదీశ్వర్ గౌడ్

డివిజ‌న్ ప‌రిధిలోని సాయి నగర్ లేబర్ అడ్డా, హరిజన బస్తీలో రూ.48.50లక్షలతో చేబట్టనున్న‌ సీసీ రోడ్డు నిర్మాణ పనుల‌కు, చంద్ర నాయక్ తండా, బాలాజీ హిల్స్ కాలనీల‌లో రూ.46 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న‌ సీసీ రోడ్డు నిర్మాణ పనుల‌కు, ఖానామెట్ ముస్లిం బస్తీ, శిల్ప హిల్స్ ల‌లో రూ.56 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న‌ సీసీ రోడ్డు నిర్మాణ పనుల‌కు, రవి కాలనీలో రూ.20.70లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనుల‌కు, ఆదిత్య నగర్ బస్తీలో రూ.99.20 లక్షలు, రాజారామ్ కాలనీలో రూ.7.30లక్షల అంచనా వ్యయంతో చేబట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనుల‌కు, మాతృ శ్రీ నగర్‌లో రూ.40 లక్షల అంచనా వ్యయంతో చేబట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు వారు శంకుస్థాపనలు చేశారు.

అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసిన ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, కార్పొరేట‌ర్ వి.జగదీశ్వర్ గౌడ్

ఈ సంద‌ర్బంగా ప్ర‌భుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన అన్ని హామీల‌ను నూటికి నూరు శాతం అమ‌లు చేసిన ఏకైక ప్ర‌భుత్వం తెరాస ప్ర‌భుత్వ‌మ‌ని అన్నారు. శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని అన్ని కాల‌నీలు, బ‌స్తీల్లోనూ ప్ర‌జ‌ల‌కు మెరుగైన వ‌స‌తుల‌ను క‌ల్పించడ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్నామ‌ని అన్నారు. మంత్రి కేటీఆర్ స‌హకారంతో అన్ని డివిజ‌న్ల‌లోనూ ఎప్ప‌టిక‌ప్పుడు అభివృద్ధి ప‌నుల‌ను చేప‌డుతూ ముందుకు సాగుతున్నామ‌ని అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో డీఈ రూపా దేవి, ఏఈ అనురాగ్, నాయ‌కులు శ్రీనివాస్ గౌడ్, భిక్షపతి ముదిరాజ్, మధుసూదన్ రెడ్డి, సహదేవ్, సాంబయ్య, మల్లేష్ యాదవ్, సార్వార్, శ్యామ్, సాంబశివరావు, హున్యానాయక్, లాలూ నాయక్, జంగయ్య యాదవ్, లోకేష్, తైలి కృష్ణ, కృష్ణ నాయక్, కృష్ణ, రంజిత్, సత్య రెడ్డి, లింగ బాబు, ఖాసీం, బాబూమియా, శంకర్ రావు, ముఖ్తర్, సత్యనారాయణ, రాములు యాదవ్, రామకృష్ణ, కన్నయ్య నాయుడు, అనిల్‌, రఘునాథ్, రంగారావు, అసిఫ్, లోకేష్, హనుమంతరావు, వార్డ్ సభ్యులు రహీం, శ్రీనివాస్, రామచందర్, వర్క్ ఇన్‌స్పెక్టర్లు చారి, శర్మ, వెంకటేష్, బాలు, మల్లేష్, ఎస్ఆర్పి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here