ఆల్విన్ కాలనీ(నమస్తే శేరిలింగంపల్లి): కాలనీల ముఖద్వారాలు ఆయా కాలనీల చిరునామాలకు శాశ్వత సంకేతాలుగా నిలుస్తాయని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరికెపుడి గాంధీ అన్నారు. శుక్రవారం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని తులసి నగర్ లో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖద్వారాన్ని స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ కాలనీకి అవసరమైన ఏర్పాట్లకు అసోసియేషన్ సభ్యులు స్వచ్చందంగా ముందుకు రావడం సంతోషకరమైన విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు జిల్లా గణేష్ తెరాస నాయకులు కాశినాథ్ యాదవ్, బోయకిషన్, మోజేశ్, వాసు, యాదగిరి, కాలనీ వాసులు రామకృష్ణ, చంద్రశేఖర్ రెడ్డి, గోపి చారీ, రమేష్, క్రిస్టోఫర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.