ఆడపిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి: కార్పోరేటర్ రాగం

కార్యక్రమంలో మాట్లాడుతున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి(నమస్తే శేరిలింగంపల్లి): ఆడపిల్లల విషయంలో నిర్లక్ష్యం వహించకుండా వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శుక్రవారం మహాత్మ గాంధీ జయంతిని పురస్కరించుకొని చైల్డ్ ఫండ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ , మహిళా శిశు సంక్షేమ‌ శాఖ వారి (ఐసీడీఎస్)ల సంయుక్త ఆధ్వర్యంలో పాపిరెడ్డి నగర్ ప్రభుత్వ ప్రాథమిక‌ పాఠశాలలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, సీడీపీఓ లక్ష్మీబాయి లు గాంధీజీ చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ సమాజంలో ఆడపిల్లల విలువను తెలుసుకోవాలన్నారు.‌ ప్రతి రోజు ఏదో ఒక‌ చోట అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతూనే‌ ఉన్నాయని, వీటిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం‌ మహిళల సంరక్షణ‌ కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. వాటిని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలనే సూచించారు. ఈ కార్యక్రమంలో‌ వార్డుసభ్యుడు పొడుగు రాంబాబు, ఐసీడీఎస్ సూపర్ వైజర్ జ్యోతి, చైల్డ్ ఫండ్ కో ఆర్డినేటర్లు దీప, దివ్య, అంగన్ వాడీ‌ టీచర్లు తదితరులు ఉన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here