నమస్తే శేరిలింగంపల్లి:మియాపూర్ డివిజన్ అభివృద్ధికి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పేర్కొన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని బాలాజీ నగర్ లో స్థానిక నాయకులతో కలిసి కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న యూజీడీ పైపులైన్ పనులను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పేర్కొన్నారు. ప్రతి కాలనీ, బస్తీలో ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు పాటుపడుతున్నామని చెప్పారు. యూజీడీ పైపులైన్ పనుల్లో నాణ్యత పాటించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. యూజీడీ పైపులైన్ పనులతో శాశ్వత సమస్య పరిష్కారం కానుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ విశ్వనాధ్ రెడ్డి, స్థానికులు పాల్గొన్నారు.