నమస్తే శేరిలింగంపల్లి:చందానగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలలో చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం లో బతుకమ్మ పండగ ను ఆడపడుచులు సంతోషాలతో జరుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ కానుకలను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. విశ్వ వ్యాప్తంగా బతుకమ్మ పండగకు విశిష్టత దక్కిందన్నారు. శివాజి నగర్, గౌతమీ నగర్ పలు కాలనీలలో ఏర్పాటు చేసిన దేవీ నవరాత్రోత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు జనార్ధన్ రెడ్డి, గురుచరణ్ దూబే, ఎస్ ఎన్ రెడ్డి, నర్సింహా, రామస్వామి, వేంకటస్వామి, రవీందర్ రెడ్డి, కొండల్, గౌరవ్ తదితరులు పాల్గొన్నారు.