నమస్తే శేరిలింగంపల్లి: పటాన్‌చెరు నియోజకవర్గం అశోక్ నగర్ వినాయక మందిరం వద్ద పునర్నిర్మాణం చేస్తున్న దుకాణ సముదాయాలతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని చందానగర్ డివిజన్ పరిధిలోని భవానీపురం కాలనీ, శంకర్ నగర్, భవాని శంకర్ నగర్, శంకర్ నగర్ ఫేజ్ 1, ఫేజ్ 2, వెంకట రమణ కాలనీ అసోసియేషన్ల సభ్యులు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం అందజేశారు. వినాయక మందిరం వద్ద షాపింగ్ కాంప్లెక్స్ పునరుద్ధరణ పనులు చేపట్టడం ద్వారా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని సానుకూలంగా స్పందించినట్లు అసోసుయేషన్ల సభ్యులు తెలిపారు. అనంతరం పటాన్ చెరు కమిషనర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.