నమస్తే శేరిలింగంపల్లి: ప్రపంచ మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన సదస్సును మియాపూర్ లో నిర్వహించారు. ప్రపంచ మానవ హక్కుల సంఘం జాతీయ చైర్మన్ మొరం రెడ్డి సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ యూత్ వింగ్ వర్కింగ్ చైర్మన్ మేకల వెంకయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్రచైర్మన్ తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సంస్థ కు సంబంధించిన విధి విధానాలతో పాటు హక్కులపై అవగాహన కల్పించారు. నూతనంగా సంస్థలోకి చేరిన వారికి అపాయింట్మెంట్ లెటర్స్, ఐడి కార్డ్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా వింగ్ చైర్ పర్సన్ బొమ్మిరెడ్డి సంధ్యారెడ్డి, శేరిలింగంపల్లి మండల చైర్ పర్సన్ టి.కవితరెడ్డి, సికింద్రాబాద్ నియోజకవర్గం చైర్మన్ జంగాల వెంకట చైతన్య కుమార్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా యూత్ వింగ్ వర్కింగ్ చైర్మన్ ఎ. అజిత్ బాబు, సికింద్రాబాద్ యూత్ వింగ్ వైస్ చైర్మన్ మాసమని బాలక్రిష్ణ యాదవ్, మహిళా వింగ్ యూత్ వర్కింగ్ చైర్ పర్సన్ దండు సహస్త్ర, ప్రపంచ మానవహక్కుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.