శాఖాహారం తో ఇన్ని ప్రయోజనాలా..!

  • అక్టోబర్ 1 ప్రపంచ శాఖాహార దినం
  • శాఖాహారం తో హృద్రోగాలు, డయాబెటిస్ దూరం
  • సంపూర్ణ పోషకాలు.. అదుపులో కొలెస్ట్రాల్

నమస్తే శేరిలింగంపల్లి: ప్రపంచంలో ఎక్కడ చూసినా వేగనిజం అనే మాట బాగా వినిపిస్తుంది. తినే ఆహారం మాత్రమే కాకుండా జీవన శైలిలో సైతం అహింసా ధోరణిలో మార్పులు చేసుకుంటున్నారు వీగన్లు. గణాంకాలను పరిశీలిస్తే ప్రతీ సంవత్సరం శాకాహారులుగా మారుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. దీనికి ముఖ్య కారణం ఆరోగ్యకరమైన జీవనం కోసమే అంటున్నారు ఆహార నిపుణులు. మాంసహారులతో పోల్చితే శాఖాహారులు కొన్ని రకాల వ్యాధుల నుండి రక్షణ పొందగలుగుతున్నారు అనే విషయం పరిశోధనల్లో కూడా ఋజువవుతోంది. మరి అటువంటి శాఖాహారం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..!

ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 1 ని ప్రపంచ శాఖాహార దినం గా నిర్వహిస్తారు. తద్వారా శాఖాహారం కారణంగా లభించే లాభాలపై
అవగాహన కలిపించడంతో పాటూ శాఖాహారం తీసుకొనే వారి సంఖ్యను పెంచడం లక్ష్యంగా ఈ రోజు పని చేయడం జరుగుతుంది.
శాఖాహారం అంటే మాంసాహారం తీసుకోకుండా కేవలం పండ్లు, కూరగాయలు లేదా మొక్కల నుండి ఉత్పత్తైన ఆహార పదార్ధములతో తయారు చేసిన ఆహారం అని చెప్పవచ్చు. ఇలా నానాటికీ ప్రాచుర్యం పొందుతున్న శాఖాహారం కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ….

శాఖాహారులు-రకములు

శాఖాహారం అంటే కేవలం మొక్కలతో ఉత్పత్తైన ఆహారమని పేర్కొన్నా ప్రపంచ వ్యాప్తంగా పలు రకములైన శాఖాహారులున్నారు.
వేగన్స్-వీరు పూర్తి స్థాయి శాఖాహారులు, జంతువులు పౌల్టీ, మాంసం అంటే ఫాంలలో తయారైన కోళ్లు వంటివి, చేపలతో పాటూ జంతువులు అందించే పాల ఉత్పత్తులు, గుడ్లు వంటి వాటిని కూడా స్వీకరించరు.
లాక్టో-ఓవో శాఖాహారులు-వీరు మాంసం, పార్టీ ఉత్పత్తులు, చేపలు తీసుకోరు కాని గుడ్లు మరియు పాల ఉత్పత్తులు
స్వీకరిస్తారు.
లాక్టో శాఖాహారులు-వీరు మాంసం, పార్టీ ఉత్పత్తులు, చేపలు, గుడ్లు కూడా తీసుకోరు కాని పాల ఉత్పత్తులు స్వీకరిస్తారు.
ఓవో శాఖాహారులు-వీరు మాంసం, పౌలీ ఉత్పత్తులు, చేపలు, పాల పదార్థములు స్వీకరించరు కాని గుడ్లు తింటారు.
పాక్షికమైన శాఖాహారులు వీరు మాంసం తీసుకోకుండా సముద్రంలో లభించే చేపలు వంటి వాటితో పాటూ పౌల్టీ ఉత్పత్తులు స్వీకరిస్తారు.

Vegan word cloud

శాఖాహారం వలన కలిగే లాభాలు

  • మెటబాలిజం పెంచడం ద్వారా శరీర బరువును నియంత్రణలో ఉంచుతుంది.
  • శాఖాహారం శరీరానికి అవసరమైన ఫైబర్, యాంటాక్సిడెంట్స్, విటమిన్స్ వంటి సంపూర్ణ పోషకాలను అందిస్తుంది.
  •  మాంసాహారం తీసుకోకపోవడం వలన కొవ్వు వినియోగం తగ్గుతుంది.
  •  శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయి తగ్గిస్తుంది.
  • జంతువులను సంరక్షిస్తుంది.
  • అన్ని వర్గాల ప్రజలు అంటే చిన్నారులు, వృద్ధులు, మహిళలకు అవసరమైన సంపూర్ణ పోషకాలు సులభంగా లభిస్తాయి.

శాఖాహారం-ఆరోగ్యం

ఎక్కువ శాతం మంది వైద్యులు, పౌష్టికాహార నిపుణులు అంగీకరించేదేమిటంటే శాఖాహారం కారణంగా ఆరోగ్యానికి మంచి
జరుగుతుందని. ముఖ్యంగా మాంసం తినడం మానివేయడం వలన హృద్రోగ ప్రమాదం తప్పుతుందని పలు పరిశోధనలు
తెలుస్తున్నాయి. ఇక శాఖాహారం కారణంగా టైప్ 2 డయాబెటీస్ ప్రమాదం కూడా తప్పుతుందని పరిశోధనలు తెలుస్తున్నాయి. శాఖాహారం తినే వారిలో ట్రైగ్లిసెరైడ్స్, గ్లూకోజ్ స్థాయిలు, రక్తపోటు మరియు బియంఐ (బాడీ మాస్ ఇండెక్స్) పరిమితులలో ఉంటాయని తెలింది. శాఖాహారంలో ఉండే ముఖ్యమైన పోషకాలు క్రింద ఆహార పదార్ధములను మెనూలో ఉంచుకోవడం వలన ముఖ్యమైన పోషకాలు పొందవచ్చు.

  • ప్రొటీన్లు-టోఫు, బీన్స్ మరియు ఇతర చిక్కుళ్లు, గింజలు, గుడ్లు, ఎక్కువ ప్రోటీన్ కలిగిన ధాన్యాలైన కొయినా, అమర్నాథ్
    వంటి వాటితో పాటూ రాజ్ మా, చోలే, పన్నీరు వంటి వాటిలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి.
  • ఐరన్-గుడ్లు, ఆకుకూరలు, ఫోర్టిఫైడ్ సిరియల్స్, సోయా ఆధారిత ఉత్పత్తులు, గింజలు, బీన్స్ వంటి చిక్కుళ్లు, బ్రెడ్ వంటి
    వాటిలో ఎక్కువగా దొరుకుతాయి.
  • కాల్షియం-పాల ఉత్పత్తులు టోఫు, బాదం, ఆరెంజ్ జ్యూస్, పచ్చటి ఆకుకూరలు రాగి, వంటి వాటిలో కాల్షియం ఎక్కువగా
    ఉంటుంది.
  • జింక్-రోగనిరోధక శక్తికి అవసరమైన జింక్ ఎక్కువగా సోయా బీన్స్, గుడ్లు, పాల ఉత్పత్తులు, గింటలు, మష్రూమ్స్,
    కాయధాన్యాలు, బఠానీలు వంటి వాటిలో ఉంటుంది.
  • విటమిన్ బి 12-సోయా ఉత్పత్తులు, ఫోర్టిఫైడ్ సిరియల్స్ లో ఉంటుంది.
  • రిబోఫ్లావిన్-బాదంపప్పులు, ఫోర్టిఫైడ్ సిరియల్స్, అవు పాలు, పాల ఉత్పత్తులు, మష్రూమ్స్, సోయా పాలలో ఉంటుంది.
    ఆల్ఫా లినోలెనిక్ ఆమ్లం (ఓమెగా 3)-కానో లా ఆయిల్, ఫ్లాక్స్ సీడ్ ఆయిల్, వాల్ నట్స్, సోయా బీన్స్, టోఫూలలో ఇది
    దొరుకుతుంది

సంపూర్ణ పౌష్టికాహార తయారీ

మనం తయారు చేసుకొనే ఆహారంలో పైన పేర్కొన్న పౌషకాలన్నీ ఉండేలా చూసుకోవాలి. అందుకు అవసరమైన మెనూ తయారీకి కసరత్తు చేసుకొని వంటకాలు ఉండేలా చూసుకోవాలి. అయితే శాఖాహారంలో విటమిన్ బి 12 ఉండదు కాబట్టి అందుకోసం అవసరమైతే విటమిన్ బి 12 సప్లిమెంట్స్ తీసుకోవడం లేదా ఇటీవల కాలంలో బి 12 విటమిన్ చేర్చి వస్తున్న ఫోర్టిఫైడ్ సిరియల్స్ ను తీసుకోవచ్చు. ఇది తీసుకోకపోతే కండరాల బలహీనత ఏర్పడవచ్చు. కాబట్టి దీన్ని అవసమరైన మోతాదులో ఉండేలా సీరియల్స్ ను ఎంపిక చేసుకొని తీసుకోవడం చేయవచ్చు. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా రక్షణ
మాంసాహారులతో పోలిస్తే శాఖాహారులు తక్కువ కొవ్వు, కొలెస్ట్రాల్ తీసుకొంటూ ఎక్కువగా విటమిన్ సి, విటమిన్ ఇ, డైటరీ ఫైబర్, ఫోలిక్ యాసిడ్, పోటాషియం, మెగ్నీషియం తో పాటూ ఫైటో కెమికల్స్ (అంటే మొక్కలలో ఉండే రసాయినాలు) అయిన
కార్టోనాయిడ్స్, లేదా ప్లావోనాయిడ్స్ వంటివి తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ తక్కువ ఏర్పడుతుంది. దీంతో రక్తపాటు, బరువు వంటివి అదుపులో ఉండి జీవన ప్రమాణాలను పెంచి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. అయితే ఖచ్చితంగా ఎటువంటి ఆరోగ్య లాభాలున్నాయనే విషయం తో పాటూ దీర్ఘకాలిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయనే అంశంపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. వీటితో పాటూ ఎక్కువ శాతం శాఖాహారులు పొగ త్రాగకపోవడం, ఆల్కహాల్ కు దూరంగా ఉండడం, సరైన వ్యాయామం చేయడం వంటి వాటి ప్రభావం పై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే పలువురు పలు కారణాలతో శాఖాహారులుగా మారడానికి ఇష్టపడుతున్నారు. దీనికి జంతువుల పై ప్రేమతో పాటూ మంచి ఆరోగ్యం అందిస్తుందనే భావన కూడా. ఇక ఎక్కువ శాతం మతం, సాంప్రదాయాల కారణంగా శాఖాహారులుగా ఉంటున్నారు.

Article is prepared by
Dr A Kiraannmayee, Chief Clinical Dietitian, Apollo Cradle, Jubilee Hills, Hyderabad

శాఖాహారం పై అపోహలు, వాస్తవాలను మా తర్వాతి పోస్టులో చదవండి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here