హఫీజ్ పేట్ (నమస్తే శేరిలింగంపల్లి): దేశ ప్రజలను ఒక్క తాటిపైకి తీసుకువచ్చి స్వాతంత్య్ర ఉద్యమంలో ఐక్యతను చూపిన జాతిపిత మహాత్మాగాంధీని స్పూర్తిగా తీసుకొని నేటి యువత ముందుకు సాగాలని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ పిలుపునిచ్చారు. హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని మదీనాగూడా వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికులకు స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాలింగ్ గౌతమ్ గౌడ్, బాలరాజు, యాదగిరి, శ్రీనివాస్ గౌడ్, వాలా హరీష్ రావు, జనార్దన్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, సాయి యాదవ్, శివ తదితరులు పాల్గొన్నారు.