నమస్తే శేరిలింగంపల్లి: పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలు, ఆదర్శాలు నేటి తరానికి ప్రేరణగా ఉండాలని బిజెపి రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్ అన్నారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జన్మ దినాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపి నగర్ బీసీ హాస్టల్ లో డివిజన్ అధ్యక్షుడు రాజు శెట్టి కురుమ ఆధ్వర్యంలో చింతకింది గోవర్ధన్ గౌడ్ మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తికే తొలి ప్రభుత్వ ప్రయోజనం చేకూరాలని, ఆంత్యోదయ ప్రేరణ, వ్యక్తి, సమాజం వేర్వేరు కావని రెండింటిలో ఒకే ఆత్మ ఉంటుందంటూ భారత సమగ్రాభివృద్ధికై ప్రవచించిన ఏకాత్మ మానవవాదం స్ఫూర్తినిచ్చిన మహనీయుడు దీన్ దయాళ్ అడుగుజాడల్లో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా మేధావుల సెల్ కన్వీనర్ రాఘవేందర్ రావు, నాయకులు కె. ఎల్లేష్, భరత్ రాజ్, భీమని విజయ లక్ష్మి, డివిజన్ ప్రధాన కార్యదర్శి సత్య కురుమ, రజనీ, ఝాన్సీ, మహేష్ గౌడ్, అశోక్ గౌడ్, కృష్ణ గౌడ్, సుధాకర్, కృష్ణ, జంగన్న, శంకర్, శ్రీకాంత్, కిరణ్, భద్ర, ముని, ఫారూఖ్, మహేష్, బీజేపీ కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.