వాచ్ మెన్ కుటుంబానికి హోప్ ఫౌండేషన్ రూ.10 వేల ఆర్థిక సహాయం – అభింనందించిన ప్ర‌భుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ఆపదలో‌ ఉన్న వారికి హోప్ ఫౌండేషన్ అండగా నిలవడం అభినందనీయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. మియాపూర్ కు చెందిన నిరుపేద వాచ్ మెన్ కుటుంబం ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న హోఫ్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ సహృదయంతో ఇచ్చిన రూ. 10 వేల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ చేతుల మీదుగా బాధిత‌ కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ సామాజిక సేవ లో చురుగ్గా ఉంటున్న హోప్ ఫౌండేషన్ ను అభినందించారు. మియాపూర్ కు చెందిన శ్రీనివాస్ వాచ్ మెన్ విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడన్నారు. వాచ్ మెన్ భార్య మంగాదేవి అనారోగ్యం కారణంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న హోప్ ఫౌండేషన్ వైద్య ఖర్చుల నిమిత్తం చైర్మెన్ కొండ విజయ్ ఆర్థిక సహాయం చేయడం అభినందనీయమన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ కార్పోరేటర్ రాగం నాగేందర్ యాదవ్, రెడ్డి రఘనాథ్ రెడ్డి, అక్బర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

హోప్ ఫౌండేషన్ సహాయంతో వాచ్ మెన్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here