నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ సరస్వతీ విద్యామందిర్ లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా బిల్డర్ ఆనందరావు పాల్గొని మాట్లాడారు. సమాజ నిర్మాణంలో టీచర్ల ప్రాధాన్యతను వివరించారు. పాఠశాల పాలక వర్గం ఆధ్వర్యంలో పాఠశాలలో 20 సంవత్సరాలకు పైగా ఆంగ్లభాషోపాధ్యాయురాలిగా పనిచేసి పదవీ విరమణ చేసిన ఎం. భాస్కరలక్ష్మిని ఘనంగా సన్మానించారు. ఎం.నాగవాణి, ఎం.పద్మ ను సన్మానించారు. ఈ కరోనా సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాల ఉపాధ్యాయులకు, ఇతర సిబ్బందికి బిల్డర్ ఆనంద్ రావు ఆర్ధిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి రఘునందన్ రెడ్డి, సహకార్యదర్శి రామచంద్రారెడ్డి, సభ్యులు గాల్ రెడ్డి, కిష్టయ్య, సమాజ సేవకులు టి. రామస్వామి యాదవ్, ప్రముఖ కవి భమిడిపాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.