నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ వార్డు కార్యాలయంలో మట్టి వినాయక విగ్రహాలను కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ బుధవారం పంపిణీ చేశారు. మట్టి విగ్రహాలను పూజించాలని ప్రజల్లో అవగాహన పెరుగుతుందని, వీటికి అనుగుణంగా టీఆర్ఎస్ ప్రభుత్వ యంత్రాంగం, స్వచ్ఛంద, ధార్మిక సంస్థల సహకారంతో మట్టితో చేసిన వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతుందని జగదీశ్వర్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ గౌరవ అధ్యక్షుడు ఈ. శ్రీనివాస్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు ఎర్ర గుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు ఎం.డి గౌస్, వార్డ్ సభ్యులు శ్రీనివాస్, రాంచందర్, ప్రభాకర్, పితాని శ్రీనివాస్, సాంబయ్య, దుర్గ రావు, సాదిక్, శ్రీనివాస్ గౌడ్, నుర్రుద్దీన్, తైలి కృష్ణ, కృష్ణ కాలనీ టీఆర్ఎస్ బస్తీ అధ్యక్షుడు కృష్ణ యాదవ్, సత్తి రెడ్డి, రమేష్ రెడ్డి, వెంకట్ రావు, ఎస్.అర్.పి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.