దేశ సేవకై పునరంకితమవ్వాలి: సైబరాబాద్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సీ.అనసూయ

నమస్తే శేరిలింగంపల్లి: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సైబరాబాద్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సీ.అనసూయ స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ జాతీయ జెండావిష్కరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిబ్బంది, ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ ఒక్కరూ దేశ సేవకు పునరంకితం కావాలన్నారు. స్వాతంత్ర్య పోరాటాన్ని గుర్తు చేసుకోవడం మంచి జాతి స్వేచ్ఛ కల్పించిన త్యాగధనులను మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తూ దేశానికి అంకితం కావడం లోనే ప్రతి మనిషికి సార్ధకత లభిస్తుందన్నారు. పోలీసు అధికారులు జాతి సమగ్రతకై, శాంతి సమాజ స్థాపనకు కృషి చేయాలన్నారు. ఎందరో మహానుభావులు త్యాగఫలం ఈరోజు మనందరం స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవిస్తున్నామని తెలిపారు. మహానుభావుల త్యాగాలను నిరంతరం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ ఏసీపీ సంతోష్ కుమార్, సైబర్ క్రైమ్స్ ఏసీపీ బాలక్రిష్ణా రెడ్డి, ఏసీపీ హనుమంత రావు, ఏసీపీ రామచంద్రా రెడ్డి, సీఏఓ అడ్మిన్ గీత, మినిస్టీరియల్ స్టాఫ్, సెక్షన్ల సిబ్బంది, ఇన్ స్పెక్టర్లు, ఆర్ఐలు తదితరులు పాల్గొన్నారు.

జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న సైబరాబాద్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సీ.అనసూయ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here