నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ ద్విచక్ర వాహనాల మెకానిక్స్ అసోసియేషన్ ఆద్వర్యంలో స్వాంతత్ర ఆదివారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మియాపూర్ బస్టాప్ వద్ద ఏర్పాటు చేసిన ఏర్పటు చేసిన ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మైనారిటీ విభాగం రాష్ట్ర నాయకులు ఎండీ అన్వర్ షరీఫ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్వర్ షరీఫ్ మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు. మియాపూర్ బైక్ మెకానిక్స్ అసోసియేషన్ క్రమం తప్పకుండా ప్రతి ఏడు జాతీయ పండుగలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి ఫిరోజ్, ఎండి ఇలియాస్ షరీఫ్, బి మహేందర్ ముదిరాజ్, ఎండి ఖాజా, ఎండి జహంగీర్, సయ్యద్ మోసిన్, జహంగీర్, రాజు, సురేష్, తిరుపతి తదితరులు ఉన్నారు.
