నమస్తే శేరిలింగంపల్లి: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని భాగ్యనగర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 108 సూర్యా నమస్కారాల యజ్ఞం నిర్వహించారు. మాదాపూర్ డివిజన్ ఇజ్జత్‌నగర్‌లోని రాధకృష్ణ స్పోర్ట్స్ అకాడమీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని బిజెపి డివిజన్ ఇన్చార్జీ గంగాల రాధకృష్ణ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం స్థానికులతో కలసి సూర్యనమస్కారాలు ఆచరించారు. ఈ సందర్భంగా రాధాకృష్ యాదవ్ మాట్లాడుతూ భాగ్యనగర్ ఫౌండేషన్, సంతోషి యోగ ఆధ్వర్యంలో తమ అకాడమీలో ఈ గొప్ప్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు. మన భారత ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు యోగా ఆచరించిన ప్రతి ఒక్కరికి ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలియచేశారు. యోగా వల్ల శారీరక మానసిక సంతులనం జరుగుతుందని అన్నారు. రోజు వారి జీవితంలో యోగా ఒక భాగం ఐనప్పుడే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ ఫౌండేషన్ అధ్యక్షులు పీకే చౌదరి, బాలకుమార్, సొంతోషి యోగ గురువు సంతోష్, యోగాభ్యాసకులు శిరీష, రావియాదవ్, శ్రీనుయాదవ్, శివ యాదవ్, టీవి మదనాచారి, బాలునాయక్, భాగ్యనగర్ ఫౌండేషన్ సభ్యులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.