శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్‌కు ఘ‌న నివాళి

జీవితాంతం తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కోసం ప‌రితపించిన త్యాగ‌ధ‌నుడు ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్‌: ప్ర‌భుత్వ విప్‌గాంధీ

శేరిలింగంప‌ల్లి: తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సంద‌ర్భంగా నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీనాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వ‌హించిన వ‌ర్ధంతి కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వ విప్ గాంధీ కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్ ల‌తో కలిసి జ‌య‌శంక‌ర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల‌ర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణకు ఒక దిక్సూచి అని, జీవితం లో చివరి క్షణం వరకు  తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరాయంగా తపించిన యోధుడని కొనియాడారు. ఆచార్య‌ జయశంకర్ మార్గదర్శం లో ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ అడుగుజాడల్లో న‌డిచి బంగారు తెలంగాణను సాధిద్దామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రవీందర్ రావు, విరేశం గౌడ్, హోప్ ఫౌండేషన్ ఛైర్మెన్ కొండా విజయ్, మాదాపూర్ డివిజన్ తెరాస అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు పురుషోత్తం యాదవ్, యాదగౌడ్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ చిత్ర‌ప‌టానికి నివాళుల‌ర్పిస్తున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ త‌దిత‌రులు

శేరిలింగంప‌ల్లిలో…
శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేట‌ర్ రాగంనాగేంద‌ర్‌యాద‌వ్ ఆధ్వ‌ర్యంలో ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ వ‌ర్ధంతిని సోమ‌వారం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా రైల్వేస్టేషన్ అండర్ బ్రిర్జ్ దగ్గర ఉన్న ప్రొ. జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంత‌రం నాగేందర్ యాదవ్ గారు మాట్లాడుతూ మలిదశ ఉద్యమానికి దిశ నిర్దేశంగా నిలిచి ఉద్య‌మాన్ని ఉవ్వెత్తున ఎగ‌సేలా చైతన్య‌ప‌రిచిన మ‌హానేత జ‌య‌శంక‌ర్ అని కొనియాడారు. ఈ కార్య‌క్ర‌మంలో తెరాస డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, డివిజన్ ఉపాధ్యక్షులు యాద గౌడ్, తెరాస సీనియర్ నాయకులు మల్లికార్జున శర్మ, వెంకటేశ్వరరావు, గోవిందచారి, వార్డు మెంబర్ శ్రీకళ, సందయ్య నగర్ బస్తీ కమిటీ అధ్యక్షులు బస్వరాజు, గోపినగర్ బస్తీకమిటి అధ్యక్షులు గోపాల్ యాదవ్, లింగంపల్లి విలేజ్ కమిటీ అధ్యక్షులు రవి యాదవ్, పట్లోళ్ల నర్సింహారెడ్డి, శ్రీనివాస్, గణపురం రవీందర్, రాజు, యాదగిరి, కొండల్ రెడ్డి, రాంచందర్, సభినా, భాగ్యలక్ష్మి, సుధారాణి, రోజా, అలీం, ముంతాజ్ బేగం, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ విగ్ర‌హానికి నివాళుల‌ర్పిస్తున్న రాగం నాగేంద‌ర్‌యాద‌వ్ త‌దిత‌రులు

చందాన‌గ‌ర్ డివిజ‌న్‌లో…
చందాన‌గ‌ర్ డివిజ‌న్‌లో నిర్వ‌హించిన జ‌యశంక‌ర్ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మంలో డివిజ‌న్ కార్పొరేట‌ర్ మంజుల ర‌ఘునాథ్‌రెడ్డి జ‌య‌శంక‌ర్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. ఈకార్య‌క్ర‌మంలో ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథరెడ్డి గారు టిఆర్ఎస్ నాయకులు రవిందర్ రెడ్డి, దాసు, కోండల్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ చిత్ర‌ప‌టానికి నివాళుల‌ర్పిస్తున్న కార్పొరేట‌ర్ మంజుల ర‌ఘునాథ్‌రెడ్డి త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here