నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ అన్నపూర్ణ ఎన్‌క్లేవ్‌లోని విశాఖ శ్రీ శారదా పీఠపాలిత అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. మూడు రోజుల పాటు కొనసాగిన ఈ ఉత్సవాలలో చివరి రోజు సోమవారం స్వామివారి త్రీశూల స్నానం, రుద్రహోమం, పంచసూక్త హోమాలు, పూర్ణాహుతి, బలిహరణ, ద్వజావరోహణం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మద్యాహ్నం అన్నసమారాధన, సాయంత్రం కాలనీ వీదుల్లో పల్లకీ సేవా, అనంతరం ఏకాంత సేవ నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన పరిమిత భక్తులు హాజరై స్వామి వారిని దర్శించుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఉత్సవాల ముగింపు నేపథ్యంలో ఆలయ వ్యవస్థాపక చైర్మన్ యూవీ రమణ మూర్తి మాట్లాడుతూ కరోనా కాలంలోను ప్రశాంత వాతవరణంలో ఉత్సవాలు అద్భుతంగా జరిగాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణకు కృషిచేసిన శిల్పా ఎన్‌క్లేవ్ శ్రీలక్ష్మీ గణపతి దేవాలయ ప్రధానార్చకులు వేధుల పవనకుమార్ శర్మ, అన్నపూర్ణ సాయిబాబ ఆలయ ప్రధానార్చకులు మురళీధర శర్మ, కాశీ విశ్వేశ్వరాలయ ప్రధానార్చకులు వీరేష్ బృంద పురోహితులకు, సహకారం అందించిన ఆలయ ఆస్థాన సిద్ధాంతి ప్రసాద్ శర్మకు, ఆలయ పాలక మండలి సభ్యులకు, దాతలకు, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాల్లో భాగస్వామ్యమై విజయవంతం చేసిన స్థానిక భక్తులకు రమణ మూర్తి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.