నమస్తే శేరిలింగంపల్లి: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మికి మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారి కార్యాలయంలో హైదర్‌నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలసి మేయర్ విజయలక్ష్మిని ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. వారు ఆయువు ఆరోగ్య ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్టు తెలిపారు.