శారీర‌క మాన‌సిక ఉల్లాసాన్ని క‌లిగించే దివ్య ఔషధం యోగా: జ్ఞానేంద్ర ప్రసాద్

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని హ‌ఫీజ్‌పేట్ డివిజ‌న్ బిజెపి అధ్య‌క్షులు శ్రీ‌ధ‌ర్‌రావు ఆధ్వ‌ర్యంలో యోగా దినోత్స‌వాన్ని ఇంద్రారెడ్డి ఆల్విన్ కాల‌నీ వ‌ద్ద నిర్వ‌హించారు. యోగా గురువు రాంచంద‌ర్ రెడ్డి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ హాజ‌రై డివిజ‌న్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి యోగా ఆస‌నాలు, సూర్య‌న‌మ‌స్కారాలు చేశారు. అనంతంరం జ్ఞానేంద్ర ప్రసాద్ యోగా అనేది శారీర‌క వ్యాయామం మాత్ర‌మే కాద‌ని, అది మనిషిని అత్యున్న‌త‌ స్థితికి చేరవేసే సాధ‌న‌మ‌ని తెలిపారు. భార‌త‌ ప్రధాని నరేంద్ర మోదీ గారి పాలనలో దేశం ప్రపంచ శక్తిగా ఎదుగుతోంద‌ని, ప్రపంచానికి యోగాని పరిచయం చేసిన నరేంద్ర మోదీ గారి బాటలో ప‌య‌నించి ఆర్యోగ భారతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కృష్ణ రెడ్డి, ల‌క్ష్మణ్, కోటేశ్వరరావు, రవి గౌడ్, జితేందర్, బాబు రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, శివ, రవి, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఆల్విన్ కాల‌నీలో యోగా ఆస‌నాలు చేస్తున్న జ్ఞానేంద్ర‌ప్ర‌సాద్ త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here