కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ, సైబర్ హిల్స్, కుమ్మరి బస్తీ, వడ్డెర బస్తీలలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ గురువారం జోనల్ కమిషనర్ రవి కిరణ్ కు వినతిపత్రం అందజేశారు.
డివిజన్ పరిధిలోని బస్తీలు, కాలనీల్లో మౌలిక వసతులను కల్పించేందుకు, అభివృద్ధి పనులను చేపట్టేందుకు నిధులు కేటాయించాలని కార్పొరేటర్ హమీద్ పటేల్ జోనల్ కమిషనర్ రవి కిరణ్ ను కోరారు. అలాగే డివిజన్ పరిధిలో కొత్తగా చేపట్టాల్సిన పనులపై కూడా హమీద్ పటేల్ చర్చించారు.