పన్నాల హరిచంద్రారెడ్డిని క‌లిసిన ఉప్పల ఏకాంత్ గౌడ్

వివేకానంద‌న‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా (అర్బన్) బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన పన్నాల హరిచంద్రారెడ్డిని శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ డివిజన్ బీజేపీ నాయకుడు ఉప్పల ఏకాంత్ గౌడ్ గురువారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా హ‌రిచంద్రారెడ్డిని ఏకాంత్‌గౌడ్ స‌న్మానించి ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీజేపీ నాయకులు భాస్కర్ రెడ్డి, అరవింద్ యాదవ్, రమేష్, అశోక్, అనిల్, భాస్కర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

పన్నాల హరిచంద్రారెడ్డికి శుభాకాంక్ష‌లు తెలుపుతున్న ఉప్పల ఏకాంత్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here