గోపన్‌ప‌ల్లి తండాలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి బస్తి బాట

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: శేరిలింగంప‌ల్లి నియోజకవర్గం ప‌రిధిలోని గచ్చిబౌలి డివిజన్ లోగ‌ల‌ గోపన్ పల్లి తండాలో శుక్ర‌వారం కార్పొరేట‌ర్ గంగాధ‌ర‌రెడ్డి ప్ర‌భుత్వ‌ అధికారులతో క‌లిసి ప్రజా సమస్యలపై బస్తి బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా తండాలో ప‌ర్య‌టించిన‌ గంగాధర్ రెడ్డి స్థానికంగా నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా బస్తీలో డ్రైనేజి, సీసీ రోడ్డులు, వీధి దీపాల పనితీరును ప‌రిశీలించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని త్వరగా పరిష్కరించాలని ఆయ‌న సూచించారు. ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు త‌న దృష్టికి తీసుకురావాల‌ని, వెంట‌నే ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తాన‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

బ‌స్తీబాట కార్య‌క్ర‌మంలో స్థానిక నాయ‌కులు, తండావాసుల‌తో కార్పొరేట‌ర్ గంగాధ‌ర‌రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here