నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని బిజెపి రాష్ట్ర ఓబిసి సెల్ కార్యవర్గ సభ్యులు బోయిని మహేష్‌యాదవ్ ప్రభుత్వ విప్ గాంధీని కోరారు. శుక్రవారం మహేష్‌యాదవ్ ప్రభుత్వ విప్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. అనంతరం డివిజన్ లో నెలకొన్న సమస్యలను, పరిష్కార చర్యలపై గాంధీతో చర్చించారు. ఈ సందర్భంగా మహేష్‌యాదవ్ మాట్లాడుతూ డివిజన్‌లోని సమస్యలపై త్వరలోనే సమీక్ష నిర్వహించి పరిష్కారానికి హామీ ఇచ్చినట్లు తెలిపారు. గాంధీని కలిసిన వారిలో నాయకులు మునిగొండ నవీన్, సాయిగౌడ్, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.