- రవికుమార్ యాదవ్ చొరవతో సమస్య పరిష్కారం
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని చందానగర్ నుంచి లింగంపల్లి వరకు ఉన్న అండర్ పాస్ బ్రిడ్జిని మంగళవారం బీజేపీ సీనియర్ నాయకుడు రవికుమార్ యాదవ్ పరిశీలించారు. బ్రిడ్జి కింద ఉన్న రహదారిపై నీళ్లు చేరాయని దీంతో వాహనదారులకు, పాదచారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు. ఈ క్రమంలో ఆయన సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడారు. అనంతరం అధికారులు నీటిని అక్కడి నుంచి మోటార్ల ద్వారా తొలగించే పని చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.