యువ మోర్చా నాయ‌కుల‌పై కేసుల‌ను ఎత్తి వేయాలి: బీజేవైఎం

ప‌టాన్‌చెరు (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): భార‌తీయ జ‌న‌తా యువ మోర్చా నాయ‌కుల‌పై పెట్టిన కేసుల‌ను ఉప‌సంహరించుకోక‌పోతే పెద్ద ఎత్తున ఉద్య‌మం చేప‌డుతామ‌ని బీజేవైఎం జిల్లా సీనియర్ నాయకుడు ఉరేళ్ల మహేష్ యాదవ్ హెచ్చ‌రించారు. యువ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ప‌టాన్‌చెరులో యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గుప్తా, జిల్లా యువమోర్చా ఉపాధ్యక్షుడు వికాస్ రెడ్డిల‌ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ‌ను ద‌హ‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా ఉరేళ్ల మహేష్ యాదవ్ మాట్లాడుతూ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ పై పెట్టిన అక్ర‌మ కేసుల‌ను ఎత్తివేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ గణపురం శ్రీనివాస్, యువ మోర్చా నాయకులు శివ, మణికంఠ ఆచారి, సతీష్ దీప గౌడ్, ఆర్సి పురం పట్టణ అధ్యక్షుడు సతీష్, విజయ్, ఠాగూర్, క్రాంతి, బలరాం పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్ చిత్ర‌ప‌టంతో నిర‌స‌న తెలుపుతున్న బీజేవైఎం నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here