పార్లమెంట్ క్యాంటీన్లో అందించే ఆహార పదార్థాలకు గాను ఇప్పటికే సబ్సిడీని ఎత్తి వేసిన సంగతి తెలిసిందే. ఖర్చులను కట్టడి చేసేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నామని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఇది వరకే ప్రకటించారు. అయితే రానున్న బడ్జెట్ సమావేశాల సందర్బంగా పార్లమెంట్ క్యాంటీన్‌ను అందుబాటులో ఉంచాలి కనుక తాజాగా కొత్త మెనూతోపాటు ఆహార పదార్థాల ధరల వివరాలను కూడా వెల్లడించారు.
గతంలో సబ్సిడీ ఉన్నప్పుడు అనేక పదార్థాల ధరలు చాలా తక్కువగా ఉండేవి. కానీ సబ్సిడీ ఎత్తివేయడంతో పలు ఆహారాల ధరలను పెంచారు.
* శాకాహార భోజనం ప్రస్తుతం రూ.100
* ఉడకబెట్టిన కూరగాయలు గతంలో రూ.12, ప్రస్తుతం రూ.50
* హైదరాబాద్ మటన్ బిర్యానీ, గతంలో రూ.65, ప్రస్తుతం రూ.150
* చపాతీ రూ.3 (మారలేదు)
* నాన్‌వెజ్ బఫె ప్రస్తుతం రూ.700
* వెజ్ బఫె ప్రస్తుతం రూ.500
* చికెన్ బిర్యానీ రూ.100
పార్లమెంట్ క్యాంటీన్లో ఆహార పదార్థాలకు పెంచిన ధరలు ఇలా ఉన్నాయి. (సబ్సిడీ ఎత్తివేశాక)
దీని వల్ల పార్లమెంట్‌కు రూ.8 కోట్లు ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.