ఆధార్ కార్డులకు అనుసంధానం అయి ఉన్న ఫోన్ నంబర్లను మార్చేందుకు చాలా మంది అష్ట కష్టాలు పడుతుంటారు. అయితే ఎలాంటి ఇబ్బంది పడాల్సిన పనిలేదని, ఆధార్ కార్డుకు అనుసంధానం అయి ఉన్న ఫోన్ నంబర్‌ను చాలా సులభంగా మార్చవచ్చని యూఐడీఏఐ తెలిపింది.
ఆధార్ ఒరిజినల్ కార్డును తీసుకెళ్లి ఆధార్ కేంద్రంలో సులభంగా ఫోన్ నంబర్‌ను మార్చుకోవచ్చు. అందుకు ఎలాంటి పత్రాలను చూపించాల్సిన పనిలేదు. అలాగే ఫొటో, బయోమెట్రిక్స్, ఈ-మెయిల్ వంటి వివరాలను మార్చుకోవాలనుకున్నా కేవలం ఆధార్ ఒరిజినల్ కార్డు ఉంటే చాలు, ఎలాంటి ప్రూఫ్‌లు చూపించాల్సిన పనిలేదు. ఆయా వివరాలను సులభంగా అప్డేట్ చేయించుకోవచ్చు. ఈ వివరాలను యూఐడీఏఐ తెలియజేసింది.
#UpdateMobileInAadhaar
Adding a mobile number to Aadhaar doesn’t require any document. Just carry your Aadhaar to any nearby Aadhaar Center to place an add/update mobile number request.
Find your nearest Aadhaar Center here https://t.co/dtBtCHqxOK pic.twitter.com/2enGCGk9p2— Aadhaar (@UIDAI) January 24, 2021