హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): ఫిబ్రవరి 11వ తేదీన నగరంలోని చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి డాక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కార్యాలయం అధికారులు ఒక ప్రకటలో తెలిపారు. కార్యాలయంలోని రెండో అంతస్తులో ఉన్న సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా పౌరులు పోస్టల్ శాఖకు సంబంధించి తమకున్న ఫిర్యాదులు, సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ క్రమంలో వారు తమ ఫిర్యాదులను ఫిబ్రవరి 4వ తేదీలోగా చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయానికి చేరేలా పంపించాలని సూచించారు.