శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): స్వామి వివేకానంద 158వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్ లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ సమాజం కోసం పాటుపడిన వారందరూ మహానుభావులేనన్నారు. అందులో కొంతమందే మహర్షులవుతారని, అలాంటే వ్యక్తే స్వామి వివేకానంద అని అన్నారు. శ్రీ రామకృష్ణ పరమహంసకు ప్రియ శిష్యుడైన వివేకానంద దేశంలో హిందూ మతం పునరుజ్జీవనంలో ప్రధాన పాత్ర పోషించారని, పాశ్చాత్య ప్రపంచానికి భారతీయ వేదాంతం, ఆధ్యాత్మికత, యోగా, తత్వాలను పరిచయం చేయడంలో కీలకపాత్ర పోషించిన వారిలో ఆయన ముందు వరుసలో ఉంటారని అన్నారు. ఆయన ఓ గొప్ప నాయకుడని, ఆయన ఉపన్యాసాలు, అక్షరాలు, ఆలోచనలు చాలామందిలో స్ఫూర్తి నింపాయని అన్నారు. ఈ స్పూర్తి భారత్ కే మాత్రమే కాదు ప్రపంచానికి కూడా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి తెరాస నాయకులు పాల్గొన్నారు.


కార్పొరేటర్లు రోజా దేవి రంగారావు, జూపల్లి సత్యనారాయణలతో కలిసి…
కార్పొరేటర్లు రోజా దేవి రంగారావు, జూపల్లి సత్యనారాయణలతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ స్వామి వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగారావు, తెరాస నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, లక్తర్, చలపతి రావు, రాంచందర్ రావు, హిమగిరి రావు, అందే నర్సింహులు, వేణు, మోజేష్, సాలయ్య, చంద్రమౌళి సాగర్, చంద్రశేఖర్, శ్రీనివాస్ రెడ్డి, రాము, రవి, సురేష్, విద్యాసాగర్, అనిల్, చిన్నా, నరేష్, మురళి, జగదీష్, అరుణ్, హరి, సంతోష్, రంజిత్, మంజుల, పద్మ, భులక్ష్మి పాల్గొన్నారు.






