చిన్నారుల కోసం కాల‌నీల్లో ఆట స్థ‌లాల‌ను ఏర్పాటు చేయాలి: కార్పొరేటర్ హమీద్ పటేల్

కొండాపూర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజన్ లోని రాఘవేంద్ర ఎ&బి కాలనీ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ ను కార్పొరేటర్ హమీద్ పటేల్ ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా హమీద్ పటేల్ మాట్లాడుతూ.. పిల్లల మానసిక ఎదుగుదలకు, ఉత్సాహానికి ఈ ఆట స్థలాలు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. ప్రతి కాలనీలోనూ పిల్ల‌ల‌ కోసం ఆట స్థలాలను ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవటం జరుగుతుందని తెలిపారు. కాలనీలలో సంఘ సభ్యులు సైతం ముందుకు వచ్చి ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేయ‌టం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ జగన్, సెక్రటరీ బసవరాజు, జాయింట్ సెక్రటరీ గౌతమ్, ట్రెజరర్ కృష్ణా రావు, సభ్యులు పుల్లయ్య, కృష్ణారావు, వేణు, కిషోర్, ఎంకే సాగర్, రహ్మత్ బీ, రాజ్యలక్ష్మి, కుమ్మరి వెంకటేష్, రాంబాబు, నాగేంద్ర, ఎమ్.మాల్యాద్రి పాల్గొన్నారు.

చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ ను ప్రారంభిస్తున్న కార్పొరేటర్ హమీద్ పటేల్
ప్లే గ్రౌండ్‌లో ఉన్న స‌దుపాయాల‌ను ప‌రిశీలిస్తున్న కార్పొరేటర్ హమీద్ పటేల్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here