వివేకానందుడి బాటలో న‌డుద్దాం: కసిరెడ్డి భాస్కరరెడ్డి

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వివేకానందుడి ఆశయాలను కొనసాగిస్తూ ఆయన బాటలో నడుద్దామని బిజెపి రాష్ట్ర నేత కసిరెడ్డి భాస్కరరెడ్డి పిలుపునిచ్చారు. తారానగర్ లో వివేకానంద జయంతి సందర్భంగా డివిజన్ బిజెపి అధ్యక్షుడు గొల్లపల్లి రాంరెడ్డి ఆధ్వర్యంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భాస్క‌ర్ రెడ్డి మాట్లాడుతూ విదేశీయులు మన దేశం మీద దండయాత్రలు చేసి మన సాంస్కృతిక చిహ్నాలు, దేవాలయాలను ధ్వంసం చేశారని, ఇప్పుడు స్వదేశంలో విదేశీ భావాలు కలిగి ఉన్న మూకలు పేట్రేగి ధ్వంస రచన చేస్తున్నారని, మనం జాగరూకులం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

స్వామి వివేకానందుడి విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించిన కసిరెడ్డి భాస్కరరెడ్డి

ఈ కార్యక్రమంలో బిజెపి చందానగర్ కార్పొరేట‌ర్‌ అభ్యర్థి కసిరెడ్డి సింధు రెడ్డి, మియాపూర్ అభ్యర్థి కె. రాఘవేందర్ రావు, మాజీ ఫ్లోర్ లీడర్ గొల్లపల్లి కృష్ణారెడ్డి, నూనె సురేందర్, రాకేష్ దూబే, శివకుమార్ వర్మ, శ్రీనివాస్ ముదిరాజ్, శ్రీనివాస్ గుప్తా, వేణుగోపాల్ పగడాల, అమరేంద్ర ప్రతాప్ సింగ్, శోభా దూబె పాల్గొన్నారు.

చందాన‌గ‌ర్‌లో…
చందాన‌గ‌ర్ డివిజ‌న్ ప‌రిధిలోని గౌత‌మిన‌గ‌ర్‌లో ఉన్న జీహెచ్ఎంసీ పార్కులోని స్వామి వివేకానంద విగ్ర‌హానికి బీజేపీ రాష్ట్ర నేత క‌సిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి పూల‌మాల‌లు వేసి ఘ‌నంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వివేకానందుడి గురించి నిర్వ‌హించిన‌ వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన‌ ఆరుగురికి నగదు, పోటీలో పాల్గొన్న వారందరికీ బహుమతుల‌ను కాల‌నీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు నూనె సురేందర్, కసిరెడ్డి సింధు రఘునాథ్ రెడ్డి, అశోక్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్, రామస్వామి, పర్వత్ రెడ్డి, కసిరెడ్డి రఘునాథ్ రెడ్డి, నాంచారయ్య, నర్సింహ, మహిళలు, చిన్నారులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

స్వామి వివేకానంద విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించిన క‌సిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here