హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట డివిజన్ పరిధిలోని మైత్రినగర్ వద్ద డివిజన్ బీజేపీ అధ్యక్షుడు శ్రీధర్ రావు ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 158వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా బీజేపీ నాయకులు స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాగేశ్వర్, జ్ఞానేంద్రప్రసాద్, రవి కుమార్ యాదవ్, కలివేముల మనోహర్, శ్రీశైలం యాదవ్, రవి గౌడ్, కోటేశ్వరరావు, మహేష్ యాదవ్, సిబి రెడ్డి, వరప్రసాద్, మహేష్ ముదిరాజ్, శివ ముదిరాజ్, అశోక్ కుమార్, లక్ష్మణ్ ముదిరాజ్, మల్లేష్, దొంతి నరసింహ ముదిరాజ్, రవి, బాబు రెడ్డి, పవన్ కుమార్, నరేందర్, ప్రశాంతి, లక్ష్మణ్ గౌడ్, నవీన్, రవి ముదిరాజ్, సాయి గౌడ్ ,బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.






