గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): సంక్రాంతి పండుగ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్మోహర్ పార్క్ కాలనీలో కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో సీనియర్స్ విభాగంలో ఎస్.రేణుక, ఎ.కల్పన, బి.అనయశ్రీలు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను గెలుచుకోగా, జూనియర్ విభాగంలో వి.భవాని, ఎస్.శ్రుతి, వి.ప్రహన్నవిలు బహుమతులను పొందారు. ఈ సందర్బంగా విజేతలకు కాలనీ వాసి, పరన్ కన్స్ట్రక్షన్స్ బిల్డర్ వెంకటేశ్వర్లు సౌజన్యంతో బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ షేక్ ఖాసీం, ప్రధాన కార్యదర్శి జె.నిరంజన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మోహన్ రావు, కార్యనిర్వాహక కార్యదర్శి కె.శ్రీను, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు శేఖర్ రావు, సత్యసాయి, నబీరసూల్, చంద్రశేఖర్, సలహాదారుడు డాక్టర్ రామారావు, న్యాయ నిర్ణేతలు కృష్ణ కుమారి, పద్మ కుమారి పాల్గొన్నారు.








