కూకట్పల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని కూకట్పల్లి డివిజన్ లో రూ. 1 కోటి 26 లక్షల 70 వేల అంచనా వ్యయంతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. డివిజన్ పరిధిలోని ఆస్బెస్టాస్ కాలనీ, దీనబంధు కాలనీ, ప్రగతి నగర్, హనుమాన్ నగర్, పాపారాయుడు నగర్, బాలకృష్ణ నగర్ లలో చేపట్టబోయే సీసీ రోడ్డు, సీసీ రోడ్డు పునరుద్ధరణ నిర్మాణ పనులు, లింకు రోడ్ల అనుసంధాన నిర్మాణ పనులు, పార్కు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ.. అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులను కల్పించడంలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. పెండింగ్లో ఉన్న పనులను కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు ఏఈ శివ ప్రకాష్, మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ రంగారావు, డివిజన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, తెరాస నాయకులు ఎల్లం నాయుడు, నాగేశ్వర్ రావు, మహేందర్, తిరుపతి, అబ్దుల్, ఖయ్యుమ్, కృష్ణ, ప్రసాద్, దాస్, టైల్స్ శ్రీను, శ్రీనివాసులు, రాజు, సదానంద, ఆంజనేయులు, జలీల్, రఫిక్, సువర్ణ, నీల, లక్ష్మమ్మ, శ్రీజ్యోతి, జయమ్మ, పద్మ పాల్గొన్నారు.






