సగర ఉప్పర సంఘం నూత‌న క‌మిటీ ఎన్నిక

కొండాపూర్‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని కొండాపూర్‌లో సగర ఉప్పర సంఘం నూత‌న క‌మిటీని సంఘం స‌భ్యులంద‌రూ క‌లిసి ఎన్నుకున్నారు. సంఘం నూత‌న క‌మిటీ అధ్య‌క్షుడిగా అశోక్ స‌గ‌ర‌, గౌరవ అధ్యక్షులుగా బంగారు హనుమంత్ సగర, ఏగ్గని జయ్ పాల్ సగర,
ఉపాధ్యక్షుడిగా బి.ఆంజనేయులు సగర, ప్రధాన కార్యదర్శిగా అనిల్ సగర, కోశాధికారిగా ఎస్‌.రామాంజనేయులు సగరలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా అశోక్ సగర మాట్లాడుతూ త‌న‌పై నమ్మకం వుంచి అద్యక్షుడిగా ఎన్నుకున్న సగర బంధువులకి ధ‌న్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సగర బంధువులు పాల్గొన్నారు.

నూత‌నంగా ఎన్నికైన స‌గ‌ర ఉప్ప‌ర సంఘం నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here