హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని అన్ని శ్మశానవాటికలను అభివృద్ధి చేస్తామని కార్పొరేటర్ వి.పూజిత జదీశ్వర్ గౌడ్ అన్నారు. సోమవారం ఆమె డివిజన్ పరిధిలోని ఓల్డ్ హఫీజ్‌పేట గ్రామంలో ఉన్న శ్మశానవాటికను స్థానికులతో కలిసి పరిశీలించారు. అనంతరం జేసీబీతో శ్మశానవాటికలో పేరుకుపోయిన మట్టి కుప్పలను, బండరాళ్లను, ముళ్ళ కంప మొక్కలను తొలగింపజేశారు.

శ్మశానవాటికలో నూతనంగా చేపట్టాల్సిన సీసీ రోడ్డు, స్నానాల గదులు, బోరు, ధ్వంసమైన ప్రహరీ గోడకు మరమ్మత్తులు చేపట్టాలని స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయమై కార్పొరేటర్ స్పందిస్తూ వెంటనే సంబంధిత అధికారులకు శ్మశానవాటిక అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బాలింగ్ యాదగిరి గౌడ్, వార్డ్ సభ్యులు కనకమామిడి వెంకటేష్ గౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు శేఖర్ గౌడ్, నరేందర్ గౌడ్, ఆనంద్ గౌడ్, జితేందర్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, శ్రీశైలం, సయ్యద్ సత్తార్ హుస్సేన్, రాధాకృష్ణ, నరేష్ ముదిరాజ్, విక్కీ, సయ్యద్ సాబేర్, మహిళలు షబనా, కాటున్ బీ పాల్గొన్నారు.





