శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని నల్లగండ్ల 11కేవీ రైల్ విహార్ ఫీడర్ పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు తారానగర్ ఏఈ రవిచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. కరెంటు తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగిస్తున్న నేపథ్యంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఫీడర్ పరిధిలోని హుడా కాలనీ, తారానగర్, శివాజీనగర్, వెంకట్ రెడ్డి కాలనీ, హుడా ట్రేడ్ సెంటర్, లింగంపల్లి రైల్వే ట్రాక్‌లలో, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బృందావన్ హోటల్ ఏరియా, లింగంపల్లి, రైల్ విహార్, రామయ్య కాలనీ ప్రాంతాల్లో కరెంటు ఉండదని తెలిపారు.





